జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (గార్డ్స్) ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు 110వ వర్ధంతి
పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్షర విజేత
చిలకలూరిపేట పట్టణంలోని వెనకబడిన తరగతుల బాలుర హాస్టల్ లో ఆదివారం జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ (గార్డ్స్) ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు 110వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ప్రముఖ సాహితీ విమర్శకులు డా.పీవీ సుబ్బారావు పాల్గొని గురజాడ జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. కొన్ని గురజాడ గేయాలు పాడి వినిపించారు. అనంతరం విద్యార్థులకు కథల పుస్తకాలు ఉచితంగా అందజేసి, వారిచే చదివించి పఠనాసక్తి కలిగించారు. తొలుత గురజాడ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రచురణల విభాగం కన్వీనర్ డా. దార్ల బుజ్జిబాబు, హాస్టల్ వార్డన్ కృపవతి, రవికిరణ్ తదితరులున్నారు.